Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సానియా అర్హురాలే.. క్రీడాశాఖ పారదర్శకతపైనే విమర్శలు: పంకజ్ అద్వానీ

సానియా అర్హురాలే.. క్రీడాశాఖ పారదర్శకతపైనే విమర్శలు: పంకజ్ అద్వానీ
, గురువారం, 3 సెప్టెంబరు 2015 (17:56 IST)
అంతర్జాతీయ టెన్నిస్‌లో భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఆటతీరును తక్కువ చేయలేమని.. ఆమె ఖేల్ రత్న అవార్డుకు అర్హురాలేనని కేంద్ర క్రీడా శాఖ అవార్డుల ఎంపికపై స్నూకర్ ప్లేయర్ పంకజ్ అద్వానీ తెలిపాడు. అయితే తన విమర్శ కేవలం కేంద్ర క్రీడాశాఖ, అవార్డుల ఎంపిక కమిటీ పారదర్శకతపైనేనని పంకజ్ వివరించాడు.

తొలిసారిగా క్రీడాశాఖపై అసంతృప్తి వ్యక్తం చేసిన అద్వానీ.. మహిళా స్నూకర్ క్రీడాకారిణి విద్యా పిళ్లై ఉదంతాన్ని ఉదహరించాడు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో మెడల్స్, ట్రోఫీలు గెలుచుకున్న ఆమెను ఇప్పటివరకు అర్జున అవార్డుకు కూడా ఎంపిక చేయకపోవడం పట్ల పంకజ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
 
క్రీడాశాఖ ఎంపిక కమిటీ పారదర్శకంగా వ్యవహరించడంలేదని పంకజ్ అద్వానీ విమర్శించాడు. కేంద్ర క్రీడా శాఖ అవార్డుల ఎంపిక కోసం ఏర్పాటుచేసిన మార్గదర్శకాల్లో స్పష్టత లేమే దానికి కారణమని అభిప్రాయపడ్డాడు. దానికి ఉదాహరణకు ఇటీవల టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు ఖేల్ రత్న ప్రకటించడాన్ని ప్రస్తావించాడు.

ఎంపిక కమిటీ ఏర్పాటు చేసిన పాయింట్ల ఆధారంగా పారాలంపియన్ గిరీష్... సానియా కంటే ఎంతో ముందు ఉన్నాడని పేర్కొన్నాడు. అయితే పాయింట్ల వ్యవస్థ సరిగా లేకపోవడమే ఇందుకు కారణంగా చెప్పుకొచ్చాడు.

Share this Story:

Follow Webdunia telugu