పాక్ ఆటగాడు ఏకే47 సంకేతం పంపితే.. భారత ఓపెనర్లు బ్రహ్మోస్‌ మిస్సైళ్లతో కుమ్మేశారు : డానిష్ కనేరియా

ఠాగూర్
సోమవారం, 22 సెప్టెంబరు 2025 (16:56 IST)
ఆసియా క్రికెట్ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి సూపర్-4 మ్యాచ్ భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత మరోమారు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లల 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. పాక్ ఆటగాళ్లలో ఫర్హాన్ (58) ఒక్కడే అర్థ శతకంతో రాణించాడు. ఆ తర్వాత 172 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్... ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. దీంతో నాలుగు వికెట్లను కోల్పోయి విజయభేరీ మోగించింది. 
 
ముఖ్యంగా, భారత ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఈ క్రమంలో అభిషేక్ వర్మ 39 బంతుల్లో 74, శుభమన్ గిల్ 28 బంతుల్లో 47 చొప్పున తొలి పది ఓవర్లలోనే ఏకంగా 105 పరుగులను రాబట్టారు. తద్వారా భారీ భాగస్వామ్యం నెలకొల్పి పాకిస్థాన జట్టు ఓటమిని ఖరారు చేశారు. 
 
ఈ మ్యాచ్‌పై పాక్ ఆటగాడు డానిష్ కనేరియా స్పందిస్తూ, సాహిబ్జాదా ఫర్హాన్ ఏకే 47 సంకేతం చూపిస్తే శుభమన్ గిల్, అభిషేక్ వర్మ తమ బ్యాట్లతో ఏకంగా బ్రహ్మోస్‌లనే ప్రయోగించారు. భారత ఓపెనర్ల ఎదురుదాడికి పాక్ బౌలర్లు నిస్సహాయులుగా మిగిలిపోయారు. కొట్టడం వేరు.. చితక్కొట్టడం వేరు. ఇది రెండో రంకం.. దాన్ని మామూలుగా అనరు.. మహా ఉతుకుడు అంటారు. అని అన్నారు. అభిషేక్, శుభమన్ గిల్‌ వంటి క్లాస్ ఓపెనర్లు ఉన్నపుడు ఇలాంటి పిచ్‌పై 200 పరుగులు లక్ష్యం కూడా చిన్నదేనని చెప్పారు. 
 
పైగా, ఓటమి తర్వాత కుంటి సాకులు వెతకడం పాకిస్థాన్ జట్టుకు అలవాటేనని ఆయన విమర్శించారు. ఇపుడు వారు ఫఖర్ జమాన్ ఔట్‌ను బలిపశువును చేస్తున్నారు. తాను ఔట్ కాలేదని అతడు ఇపుడు ఏడుస్తున్నాడు.. కానీ సంజూ శాంసన్ పట్టింది స్పష్టమైన క్యాచ్. గ్లోవ్స్ బంతి కింద ఉన్నాయి. అయినా బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటూ పాకిస్థాన్ దీనిపై రాద్దాంతం చేస్తోందని మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సమయం ఆసన్నమైంది : పవన్ కళ్యాణ్

నా ముందు ప్యాంట్ జిప్ తీస్తావా? చీపురుతో చితక్కొట్టిన పారిశుద్ధ్య కార్మికురాలు (video).. ఎక్కడ?

కొత్త ఇల్లు కట్టావ్ లక్ష ఇస్తావా లేదా? ఇవ్వనన్నందుకు యజమానిని చితక్కొట్టిన హిజ్రాలు

Low Pressure: బంగాళాఖాతంలో నవంబర్ 19 నాటికి అల్పపీడనం

నిద్రపోతున్నప్పుడు భారీ వస్తువుతో దాడి.. టైల్ కార్మికుడు హత్య.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

తర్వాతి కథనం
Show comments