Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యువీపై బ్యాటెత్తిన క్రిస్ గేల్.. తప్పించుకుని గెంతిన యువరాజ్!

యువీపై బ్యాటెత్తిన క్రిస్ గేల్.. తప్పించుకుని గెంతిన యువరాజ్!
, సోమవారం, 18 మే 2015 (11:03 IST)
ఆదివారం బెంగళూరులో ఐపీఎల్-8లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఢీకొంది. బెంగళూరుకు చెందిన క్రిస్ గేల్ ఆడుతుంటే.. ఢిల్లీ జట్టులో యువీ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

అయితే వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. ఫలితంగా మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. దీంతో ఇరు జట్లకు అంపైర్లు చెరో పాయింట్‌ను కేటాయించారు. నెట్ రన్ రేట్ లో మెరుగ్గా ఉన్న బెంగళూరు ప్లే ఆఫ్ కు వెళ్లగా, ఢిల్లీ ఇంటిబాట పట్టింది. 
 
వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోవడంతో ఇరు జట్ల ఆటగాళ్లు పిచ్ నుంచి వెనుదిరుగుతున్నారు. ఈ సందర్భంగా గేల్, యువీల మధ్య సరదా సన్నివేశం జరిగింది. యువీపై గేల్ బ్యాటెత్తి కొట్టబోగా, యువీ కూడా తప్పించుకుంటూ గెంతాడు. ఈ దృశ్యాన్ని స్టేడియానికి వచ్చిన అభిమానులు ఆసక్తిగా తిలకించారు.

Share this Story:

Follow Webdunia telugu