Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన డానియల్ వెట్టోరీ!

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన డానియల్ వెట్టోరీ!
, మంగళవారం, 31 మార్చి 2015 (18:07 IST)
అంతర్జాతీయ క్రికెట్‌కు మరో దిగ్గజం దూరమయ్యాడు. న్యూజిలాండ్ క్రికెట్ పేజీలో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్న ఆ దేశ లెజెండ్ స్నిన్నర్ డానియల్ వెట్టోరీ అన్నా ఫార్మెట్లకు గుడ్‌బై చెపుతున్నట్టు ప్రకటించారు. దీంతో వరల్డ్ కప్‌లో రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ల జాబితాలో వెట్టోరీ కూడా చేరాడు. ఇప్పటికే శ్రీలంక క్రికెట్ దిగ్గజాలు సంగక్కర, జయవర్ధనేలు, పాకిస్థాన్ నుంచి మిస్బావుల్ హక్, షాహిద్ ఆఫ్రిది, ఆస్ట్రేలియా నుంచి మైఖేల్ క్లార్క్‌కు వన్డే ఫార్మెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా, వెట్టోరీ మాత్రం అన్ని ఫార్మెట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. 
 
ఇదిలావుండగా, వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో కివీస్ జట్టు ఓటమి పాలైన నేపథ్యంలో, వెట్టోరీ రిటైర్మెంట్ నిర్ణయం టీమ్ మేట్స్, అభిమానులను బాధించేదే. కప్ విజయంతో వెట్టోరీకి గ్రాండ్ ఫేర్ వెల్ ఇవ్వాలని సహచరులు భావించినా, మెల్బోర్న్ మైదానంలో ఏదీ అనుకూలించలేదు. ఆ మ్యాచ్ అనంతరం స్వదేశానికి తిరిగివచ్చిన వెట్టోరీ ఆక్లాండ్ ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడుతూ, తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. 
 
న్యూజిలాండ్ జట్టు అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ విషయం నిర్ధారణ అయింది. అటు, ఐసీసీ కూడా వెట్టోరీ వీడ్కోలు విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. 36 ఏళ్ల వెట్టోరీ తన కెరీర్లో 113 టెస్టులాడి 362 వికెట్లు తీశాడు. బెస్ట్ బౌలింగ్ 7/87. బ్యాటింగ్‌లోనూ వెటోరీ తక్కువేమీ కాదు. 30 సగటుతో 4,531 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. వాటిలో 6 సెంచరీలు, 23 అర్థ సెంచరీలున్నాయి. వన్డేల విషయానికొస్తే 295 మ్యాచ్‌లలో 305 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాలు 5/7. 2,253 పరుగులు సాధించాడు. వాటిలో 4 అర్థ సెంచరీలు ఉండటం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu