ఆదివారం నవీ ముంబైలో భారతదేశం- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఐటీ అండ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, ఆయన భార్య బ్రాహ్మణి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను కలిశారు.
"ఈరోజు లెజెండ్‌ను స్వయంగా కలిశాను. అతని వినయం, ఆప్యాయత గురించిన కథలు పూర్తిగా నిజం వాటిని ప్రత్యక్షంగా అనుభవించడం ఒక అదృష్టం. క్రికెట్ దేవుడిగా, మరింత మెరుగైన మానవుడిగా తరాలను ప్రేరేపించినందుకు సచిన్, ధన్యవాదాలు.." ఎక్స్ ద్వారా పోస్ట్ చేశారు.
టీమిండియాను ఉత్సాహపరిచేందుకు, మహిళా క్రికెట్ పెరుగుదలను జరుపుకోవడానికి తాను ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నానని నారా లోకేష్ ఒక ప్రత్యేక సందేశంలో పేర్కొన్నారు.
అలాగే భారత్, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య నవీ ముంబై వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో నారా లోకేష్ ఫ్యామిలీ సందడి చేసింది. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌కు నారా లోకేష్ కుటుంబసమేతంగా హాజరయ్యారు.
సతీమణి నారా బ్రాహ్మణి, దేవాన్ష్‌లతో పాటుగా ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చుని సందడి చేశారు. ఈ సందర్భంగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌ను నారా లోకేష్ ఫ్యామిలీ కలిసింది. సచిన్‌తో కలిసి ఫోటోలు దిగారు. అలాగే ఐసీసీ ఛైర్మన్ జైషాను కలిశారు.