Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ట్విట్టర్లో జివా ఫోటో: వరల్డ్ కప్‌లో ధోనీ.. చేతివేళ్లు మాత్రమే?

ట్విట్టర్లో జివా ఫోటో: వరల్డ్ కప్‌లో ధోనీ.. చేతివేళ్లు మాత్రమే?
, బుధవారం, 4 మార్చి 2015 (16:17 IST)
ధోనీ గారాల పట్టి, ముద్దుల కూతురు జివా ఫోటొ ప్రస్తుతం ట్విట్టర్లో సందడి చేస్తోంది. అయితే ధోనీ కూతురు ఫుల్ ఫోటో మాత్రం కనిపించదు. ఇది అభిమానులకు నిరాశ కలిగించే వార్తే. ధోనీ భార్య సాక్షి సింగ్ ఫొటోను ట్విట్టర్‌లో పెట్టిందట. అయితే సదరు ఫొటోలో జివా చేతి వేళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. తన వేలిని పట్టుకున్న జివా చేతిని సాక్షి ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
 
గత నెల 6న గుర్గావ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జివా జన్మించిన సంగతి తెలిసిందే. అంతకుముందే ఆస్ట్రేలియా వెళ్లిన ధోనీ, కూతురుని చూసేందుకు రాలేదు. కూతురు కంటే వరల్డ్ కప్ టోర్నీకే ప్రాధాన్యమిస్తానని ప్రకటించిన ధోనీ, మెగా టోర్నీ ముగిసిన తర్వాత కాని భారత్ రానని పేర్కొన్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu