Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధోనీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి.. కోహ్లీనే కారణమా.. శాస్త్రి కామెంట్స్?

ధోనీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి.. కోహ్లీనే కారణమా.. శాస్త్రి కామెంట్స్?
, శుక్రవారం, 28 ఆగస్టు 2015 (15:35 IST)
టీమిండియా మాజీ టెస్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకునేందుకు గల కారణాలపై టీమ్ డైరక్టర్ రవిశాస్త్రి చెప్పారు. ధోనీ టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకోవడానికి ప్రస్తుత కెప్టెన్ కోహ్లీనే కారణమని పరోక్షంగా చెప్తున్నట్లుందని క్రీడా పండితులు అంటున్నారు. ఇంతకీ రవిశాస్త్రి ఏమన్నారంటే.. ధోనీ సంప్రదాయ టెస్టు ఫార్మెట్ నుంచి సరైన సమయంలో తప్పుకున్నాడని చెప్పారు. 
 
కొలంబోలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. మూడు ఫార్మాట్లలో ఆడటమంటే ధోనీ చాలా ఇష్టమని, దీనికి తోడు టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించేందుకు ఒకరు (కోహ్లీ) సిద్ధంగా ఉన్నారనే విషయం కూడా ధోనీకి బాగా తెలుసు.. అందుకే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా.. టెస్టు కెప్టెన్సీని వదులుకున్నాడని రవిశాస్త్రి అన్నారు. ధోనీ ఎందుకు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడో ఇప్పుడందరికీ అర్థమవుతుందనుకుంటా అని పరోక్షంగా కోహ్లీని ఉద్దేశించి రవిశాస్త్రి వివరించారు. 
 
ఆసీస్ టూర్ సందర్భంగా టీమిండియాలో లుకలుకలు తలెత్తాయని, జట్టులో గ్రూపిజం నెలకొందని, ధోనీకి కోహ్లీకి పొసగడంలేదని మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలను రవిశాస్త్రి వ్యాఖ్యలు నిజం చేస్తున్నాయని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu