Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేన్సర్‌తో మార్టన్ క్రో మృతి: 1995కి తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరం!

మార్టన్ క్రో మృతి: 1995కి తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరం!

కేన్సర్‌తో మార్టన్ క్రో మృతి: 1995కి తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరం!
, గురువారం, 3 మార్చి 2016 (12:29 IST)
కివీస్ క్రికెట్ దిగ్గజం మార్టన్ క్రో (53) ప్రాణాలు కోల్పోయారు. కేన్సర్‌తో సుదీర్ఘ కాలంగా బాధపడుతూ వచ్చిన మార్టన్ క్రో వెల్లింగ్టన్‌లో కన్నుమూశారు. ప్రజాదరణ పొందిన టీ20 ఫార్మాట్ మ్యాచ్‌లలో ఆడిన మార్టన్ క్రో.. హాలీవుడ్ స్టార్ రస్సెల్ క్రో సోదరుడిగా ప్రచారంలోకి వచ్చిన మార్టిన్ క్రో తనదైన శైలితో ఆకట్టుకున్నాడు. 
 
కాగా, 1962 సెప్టెంబర్ 22న ఆక్లాండ్‌లో జన్మించిన మార్టన్ క్రో.. 1982లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. కివీస్ తరఫున మొత్తం 77 టెస్టులు ఆడిన క్రో, 143 వన్డే మ్యాచ్‌లు కూడా ఆడాడు. 
 
టెస్టుల్లో 45.36 సగటుతో మొత్తం 5,444 పరుగులు చేసిన క్రో, ఓ మ్యాచ్‌లో 299 పరుగులు చేసి ట్రిపుల్ సెంచరీకి అడుగు దూరంలో ఔటయ్యాడు. వన్డేల్లోనూ 38.55 సగటుతో 4,704 పరుగులు చేశాడు. మోకాలి గాయంతో 1995లో స్వల్ప విశ్రాంతి తీసుకున్న మార్టన్ ఆపై అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. 

Share this Story:

Follow Webdunia telugu