Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చివరి బంతికి సిక్స్‌లు బాది.... ధోనీ గెలిపించిన మ్యాచ్‌లెన్ని?

ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో మ్యాచ్ ఫినిషింగ్ క్రికెటర్‌గా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మంచి పేరుంది. మ్యాచ్ ముగిసే సమయంలో ధోనీ క్రీజ్‌లో ఉంటే.. ఆ మ్యాచ్ భారత్ వశమైనట్టే. అలా, తన 1

చివరి బంతికి సిక్స్‌లు బాది.... ధోనీ గెలిపించిన మ్యాచ్‌లెన్ని?
, శుక్రవారం, 8 జులై 2016 (12:17 IST)
ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో మ్యాచ్ ఫినిషింగ్ క్రికెటర్‌గా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మంచి పేరుంది. మ్యాచ్ ముగిసే సమయంలో ధోనీ క్రీజ్‌లో ఉంటే.. ఆ మ్యాచ్ భారత్ వశమైనట్టే. అలా, తన 12 సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు. గొప్ప వికెట్ కీపర్ - బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా నిలిచాడు. ఆయన నాయకత్వంలో భారత్ వన్డే క్రికెట్ చరిత్రలో అద్భుత విజయాలు సాధించింది. అయితే, 35వ పుట్టిన రోజు జరుపుకున్న స్టార్ క్రికెటర్.. తన కెరీర్‌లో ఇప్పటివరకూ 9 సార్లు చివరి బంతికి సిక్స్ బాది జట్టును గెలిపించాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఈ ఘనతనూ మరెవరూ సాధించలేదు. 
 
అలాగే, 224- టెస్టుల్లో ఓ భారత వికెట్ కీపర్ చేసిన అత్యధిక పరుగులివి. ఆల్ టైం క్రికెట్ హిస్టరీలో ఇది సెకండ్ బెస్ట్. ఈ ఫీట్‌ను 2013లో చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ సాధించాడు. ధోనీ కన్నా ముందున్నది ఆండీ ఫ్లవర్ ఒక్కడే. ఆండీ నాగపూర్ లో ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో 232 పరుగులు చేశాడు.
 
107- పరిమిత ఓవర్ల పోటీల్లో ధోనీ సాధించిన విజయాలివి. ధోనీ కన్నా ముందు 165 విజయాలతో రికీ పాంటింగ్ ఒక్కడే ఉన్నాడు. మొత్తం 194 వన్డేలకు ధోనీ నాయకత్వం వహించగా, 107 సార్లు గెలుపు తీరాలకు భారత జట్టు చేరుకుంది. 2005లో జైపూర్ లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 15 ఫోర్లు, 10 సిక్సుల సాయంతో ఈ స్కోరు చేశాడు. ప్రపంచ వన్డే చరిత్రలో ఓ వికెట్ కీపర్ చేసిన అత్యధిక పరుగులు ఇవే కావడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ ప్రో కబడ్డీ లీగ్ పోటీలకు సన్నీ వస్తుందా? జాతీయ గీతం పాడుతుందా?