Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధోనీకి బ్రేక్.. ఈ స్టంప్స్ చాలా రేటు గురూ..!

ధోనీకి బ్రేక్.. ఈ స్టంప్స్ చాలా రేటు గురూ..!
, గురువారం, 19 ఫిబ్రవరి 2015 (14:15 IST)
2015 ప్రపంచకప్‌‌ను పురస్కరించుకుని నాలుగు రోజుల క్రితం పాకిస్థాన్‌పై మ్యాచ్ గెలిచిన సందర్భంగా.. ఆ ఆనందంలో పిచ్‌పై స్టంప్స్ తీసుకెళ్లేందుకు ధోనీ ప్రయత్నించగా.. బ్రేక్ పడింది.

ఆ స్టంప్స్ ఎత్తుకెళ్లడానికి వీల్లేదని ఎంపైర్లు అడ్డుకున్నారు. స్టంప్స్ తీసుకోనివ్వక పోవడంతో, ధోనీ నిరాశ చెందాడని వార్తలొచ్చాయి. 
 
దీనికి అసలు కారణం ఏమిటని ఆరా తీస్తే.. ఆ స్టంప్స్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ ఎల్ ఈడీ స్టంప్స్ కావడమేనని తేలింది. వీటి ఖరీదు రూ.24 లక్షలట.

ఇక బెయిల్స్ ధర సుమారు రూ.50 వేలని తెలుస్తోంది. అందువల్లే, మ్యాచ్ ముగిసిన తర్వాత స్టంప్స్‌ను పీకడానికి అనుమతించడం లేదని వీటి సృష్టికర్త ఎకెర్ మాన్ తెలిపారు.
 
స్టంప్స్ తీసుకెళ్లడం కుదరదని ఆటగాళ్లకు ఐసీసీ స్పష్టమైన సంకేతాలను కూడా ఇచ్చింది. కాగా, స్టంప్స్ సున్నితంగా ఉండటంతో, బ్యాట్ హేండిల్‌తో కొట్టడం కూడా కుదరదు. బంతి స్టంప్స్‌కు తగిలినప్పుడు వీటిలోని లైట్లు వాటంతట అవే వెలుగుతాయి. బంతి తగిలింది, లేనిది స్పష్టంగా అర్థమవుతుంది. వీటిని జాగ్రత్తగా వాడాల్సి ఉందని, లసిత్ మలింగ యార్కర్లకు ఇవి విరిగిపోయే ప్రమాదముందని ఎకెర్ మాన్ భయపడుతున్నాడట.

Share this Story:

Follow Webdunia telugu