Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆసీస్ క్రికెట్ కోచ్‌గా అతడే కరెక్ట్ : డారెన్ లీమన్

ఆసీస్ క్రికెట్ కోచ్‌గా అతడే కరెక్ట్ : డారెన్ లీమన్
, సోమవారం, 2 ఫిబ్రవరి 2015 (12:46 IST)
ఆస్ట్రేలియా క్రికెట్ కో‌చ్‌గా జస్టిన్ లాంగరే బెస్ట్ అంటూ ప్రధాన కోచ్ డారెన్ లీమన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కంగారూల జట్టుకు కోచ్‌గా తదుపరి బాధ్యతలు చేపట్టేందుకు జస్టిన్ లాంగర్‌కు అన్ని అర్హతలున్నాయని లీమన్ అభిప్రాయపడ్డాడు. 
 
ఇప్పటికే కోచ్‌గా అతను సక్సెస్ సాధించిన విషయాన్ని లీమన్ గుర్తు చేయగా, పశ్చిమ ఆస్ట్రేలియా కోచ్ ‌ఉన్న లాంగర్ చాలా విజయాలను అందించినట్లు తెలిపాడు. 
 
2017 వరకూ ఆస్ట్రేలియా కోచ్‌గా ఉండనున్న లీమన్.. అటు తరువాత కోచ్‌గా చేసే అవకాశం లేదని చెప్పాడు. ప్రపంచ కప్ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టును సమర్థంగా ఆడేలా చేయాలంటే లాంగరే కరెక్ట్ అంటూ లీమన్ వ్యాఖ్యానించాడు.

Share this Story:

Follow Webdunia telugu