Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైనా, జడేజా, బ్రోవోలపై మోడీ ఆరోపణల్ని ఖండించిన బీసీసీఐ

రైనా, జడేజా, బ్రోవోలపై మోడీ ఆరోపణల్ని ఖండించిన బీసీసీఐ
, సోమవారం, 29 జూన్ 2015 (13:44 IST)
టీమిండియా క్రికెటర్లపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛైర్మన్ లలిత్ మోడీ చేసిన ఆరోపణలను బీసీసీఐ ఖండించింది. క్రికెటర్లపై లలిత్ మోడీ చేసిన ఆరోపణలన్నీ అవాస్తమని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఇండియన్ ప్రీమీయర్ లీగ్ మ్యాచ్‌ల సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సురేష్ రైనా, రవీంద్ర జడేజా, డ్వేనీ బ్రోవోలకు ఫిక్సింగ్‌తో సంబంధముందని లలిత్ మోడీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 
 
ఇంకా ఫిక్సింగ్‌కు పాల్పడ్డ క్రికెట్లర్లకు కొందరు బుకీలు ఫ్లాట్లను కూడా బహుమతులుగా అందజేశారని మోడీ తన ట్విట్టర్‌లో బాంబు పేల్చారు. అయితే లలిత్ మోడీ ఆరోపణలన్నీ అవాస్తవమని బీసీసీఐ ఖండించింది.
 
ఇదిలా ఉంటే.. ముగ్గురు ఐపీఎల్ ఆటగాళ్లు సురేష్ రైనా, రవీంద్ర జడేజా, బ్రావోలు బెట్టింగ్‌కు సహకరించినట్లు లలిత్ మోడీ తమకు మెయిల్ పంపిన మాట వాస్తవమేనని ఐసీసీ ఒప్పుకుంది. ఈ సమాచారాన్ని ఐసీసీ అవినీతి నిరోధక విభాగాగానికి పంపడంతో పాటు.. బీసీసీఐ అవినీతి నిరోధక అధికారులకు కూడా సమాచారాన్ని చేరవేశామన్నారు. అయితే, వారేమి చర్యలు తీసుకున్నారన్న విషయంపై తమకు తిరిగి సమాచారం రాలేదని ఐసీసీ ఓ ప్రకటనలో తెలపడంపై బీసీసీఐ పైవిధంగా స్పందించింది. 

Share this Story:

Follow Webdunia telugu