Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరల్డ్ కప్ : భారత్ పాకిస్థాన్ మ్యాచ్ ఫిక్స్ అయిందా?

వరల్డ్ కప్ : భారత్ పాకిస్థాన్ మ్యాచ్ ఫిక్స్ అయిందా?
, సోమవారం, 16 ఫిబ్రవరి 2015 (12:56 IST)
వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం అడిలైడ్ వేదికగా జరిగిన భారత్ పాకిస్థాన్ మ్యాచ్ ముందుగానే ఫిక్స్ అయిందంటూ ట్విట్టర్‌లో పలువురు ట్వీట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో పాక్ 76 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసిన విషయం తెల్సిందే. 
 
అయితే ఈ మ్యాచ్ జరుగుతుండగా, పాక్ పాకిస్థాన్ ముస్లిం లీగ్ యూత్ వింగ్‌లో పనిచేస్తున్న అస్లాం ఖాన్ తనోలి అనే యువకుడు ఉదయం 11 గంటలకు మ్యాచ్ ఫలితాన్ని, ఏ జట్టు ఎంత స్కోరు చేస్తుందో కూడా తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. భారత్ సరిగ్గా 300 పరుగులు, పాకిస్థాన్ 220 పరుగులు చేస్తుందని, మ్యాచ్ చివర్లో 5 ఫోర్లు వస్తాయని, ఈ అంకెల్లో ఎలాంటి తేడా ఉండని తాను ఛాలెంజింగ్ చేస్తున్నట్లు ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. 
 
అతను చేసిన ట్వీట్ అంకెలకు చాలా దగ్గరగా భారత్ - పాకిస్థాన్ జట్ల స్కోర్లు ఉండటం అభిమానుల్లో కొన్ని ప్రశ్నలు ఉదయించేలా చేస్తోంది. అస్లాం ఖాన్ తనోలి అనే యువకుడు అంత ఖచ్చితంగా భారత్ - పాక్ మ్యాచ్ స్కోర్లు ఎలా చెప్పాడనే ప్రశ్న హాట్ టాపిక్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో ఫిక్సింగ్ జరిగిందనే అనుమానాలను కొందరు అభిమానులు లేవనెత్తారు. ఏదైతేనేం పాకిస్ధాన్‌పై టీమిండియా గెలిచి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu