Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IND vs SA: యశస్వి జైశ్వాల్ శతక్కొట్టుడు.. విరాట్ కోహ్లీ నో లుక్ సిక్స్.. ఇదే మ్యాచ్ హైలైట్

Advertiesment
Yashasvi Jaiswal

సెల్వి

, శనివారం, 6 డిశెంబరు 2025 (22:07 IST)
Yashasvi Jaiswal
దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. వైజాగ్ వేదికగా శనివారం జరిగిన ఆఖరి వన్డేలో సమష్టిగా రాణించిన టీమిండియా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ 44 ఓవర్లలో వికెట్ నష్టానికి పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. 
 
ఈ మ్యాచ్‌ను గెలిపించడంలో యశస్వి జైశ్వాల్ కీలక పాత్ర పోషించాడు. తన అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. యశస్వి జైస్వాల్(116 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 107) సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57), రోహిత్ శర్మ(73 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75) హాఫ్ సెంచరీలతో రాణించారు. 
webdunia
Yashasvi Jaiswal
 
సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ ఒక్కడే వికెట్ తీయగా మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆ తర్వాత పోటా పోటీగా పరుగులు రాబట్టిన ఈ జోడీ..61 బంతులు మిగిలి ఉండగానే విజయలాంఛనాన్ని పూర్తి చేసింది. కార్బిన్ బోష్ బౌలింగ్‌లో లాంగాన్ దిశగా విరాట్ కోహ్లీ కొట్టిన నో లుక్ సిక్స్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైజాగ్ స్టేడియంలో సెల్ఫీల కోసం కుర్రాళ్లు, మరీ ఆ గీరల చొక్కా వ్యక్తితో రోహిత్ షాక్