Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్రికెట్ మ్యాచ్‌లు ఆడాలో? వద్దో? భారత్-పాకే డిసైడ్ చేసుకోవాలి: ఐసీసీ

క్రికెట్ మ్యాచ్‌లు ఆడాలో? వద్దో? భారత్-పాకే డిసైడ్ చేసుకోవాలి: ఐసీసీ
, మంగళవారం, 25 ఆగస్టు 2015 (19:48 IST)
భారత్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులే.. క్రికెట్ మ్యాచ్‌లు ఆడాలో? వద్దో? నిర్ణయించుకోవాలని ఐసీసీ ఛైర్మన్ జహీర్ అబ్బాస్ స్పష్టం చేశారు. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడాలని భారత్‌ను ఐసీసీ ఒత్తిడి చేసే ప్రసక్తే లేదని అబ్బాస్ తేల్చి చెప్పేశారు. పాకిస్థాన్‌లోని లాహోర్లో జహీర్ అబ్బాస్ మాట్లాడుతూ.. ఐసీసీ క్రికెట్ ఆడాలని ఏ రెండు దేశాల క్రికెట్ బోర్డులను బలవంతం చేయట్లేదన్నారు. 
 
ఇదిలా ఉంటే.. భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ నవంబరులో జరిగే అవకాశం ఉందంటూ పీసీబీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబరులో యూఏఈ వేదికగా క్రికెట్ ఆడాలని బీసీసీఐ, పీసీబీ నిర్ణయించుకున్నప్పటికీ.. ఇంతలో భారత్-పాక్‌ల మధ్య చర్చలు రద్దయ్యాయి. 
 
అంతేగాకుండా దౌత్య, రాజకీయ పరమైన సమస్యలు పరిష్కారం కాకుండా, సరిహద్దుల్లో పాక్ టెర్రరిస్టులు భారత సైనికులను హత్య చేస్తుంటే క్రికెట్ ఎలా ఆడతామని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇంకా ఆటగాళ్ల భద్రతే తమకు ముఖ్యమని ఠాకూర్ స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu