Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అక్టోబర్‌లో లంకటూర్.. వెస్టిండీస్ టెస్టు కెప్టెన్‌గా హోల్డర్

అక్టోబర్‌లో లంకటూర్.. వెస్టిండీస్ టెస్టు కెప్టెన్‌గా హోల్డర్
, శనివారం, 5 సెప్టెంబరు 2015 (18:12 IST)
అక్టోబర్‌లో శ్రీలంక పర్యటనకు వెస్టిండీస్ సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ టెస్టు కెప్టెన్‌గా జాసన్ హోల్డర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇప్పటి వరకు టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన దినేష్ రామ్ దిన్ స్థానంలో జాసన్ హోల్డర్‌ను కెప్టెన్‌గా నియమించినట్టు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు శనివారం ప్రకటించింది. బోర్డు డైరెక్టర్లంతా జాసన్ హోల్డర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు చీఫ్ సెలెక్టర్ క్లైవ్ లాయిడ్ వెల్లడించారు. 
 
కాగా, గతేడాది టెస్టుల్లో అరంగేట్రం చేసిన జాసన్ హోల్డర్ కేవలం 8 టెస్టులే ఆడాడు. టెస్టుల్లో ఆడటం ప్రారంభించిన కొద్ది రోజులకే జాసన్ హోల్డర్‌కు విండీస్‌ కెప్టెన్‌‌గా బాధ్యతలు లభించడం విశేషం. వెస్టిండీస్ వన్డే జట్టు బాధ్యతలు మోస్తున్న జాసన్ హోల్డర్‌కే టెస్టు బాధ్యతలు అప్పగించడంతో జట్టు స్థిరంగా రాణిస్తుందని క్రీడా పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu