Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ లోనెక్ టాప్ ఏంటీ...? మార్చుకుని వచ్చి మాట్లాడు... భారత్ యాంకర్‌కి ఆమ్లా షాక్

ఆ లోనెక్ టాప్ ఏంటీ...? మార్చుకుని వచ్చి మాట్లాడు... భారత్ యాంకర్‌కి ఆమ్లా షాక్
, శనివారం, 6 ఫిబ్రవరి 2016 (18:43 IST)
కొంతమంది యాంకర్ల వేషధారణ గురించి చెప్పక్కర్లేదు. టైట్ ఫిట్స్, అందాలను ప్రదర్శిస్తూ కనబడుతుంటారు. అది వారి ఇష్టం కావచ్చు కానీ, అలాంటి వస్త్రధారణ కొంతమందికి నచ్చదు. అలాంటి జాబితాలో సౌతాఫ్రికా క్రికెట్ కెప్టెన్ హషీమ్ ఆమ్లా కూడా ఉన్నారు. అతడు ఇస్లాంను, ఆ మత విశ్వాసాలను నిష్టగా ఆచరిస్తాడు. ఐతే ఇటీవల సఫారీలతో జరిగిన చివరి వన్డే సిరీస్ సందర్భంగా ఆమ్లాతో మాట్లాడేందుకు ముంబైలో ఓ యాంకర్ ఆయన్ను ఆహ్వానించింది. 
 
ఇంటర్వ్యూలో మాట్లాడేందుకు వచ్చిన ఆమ్లా ఆమెను తేరిపార చూసి... నా ఇంటర్వ్యూ కావాలంటే ముందు నీ బట్టలు మార్చుకుని రా. ఒళ్లంతా కప్పి ఉన్న దుస్తులు ధరించి వస్తే ఇస్తా అని చెప్పాడట. ఐతే ఆమె ఆమ్లా మాటను పట్టించుకోకుండా ఇతర జట్టు సభ్యులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా... తామెవరమూ మాట్లాడబోమనీ, ఆమ్లాతోనే మాట్లాడాలని చెప్పారట. ఇక చేసేది లేక ఆ యాంకర్ తన లోనెక్ టాప్‌ను, మిడ్డీని మార్చుకుని నిండైన దుస్తులతో వచ్చిన తర్వాత ఆమ్లా ఇంటర్వ్యూ ఇచ్చాడట.

Share this Story:

Follow Webdunia telugu