Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోహ్లీపై రిచర్డ్స్ ప్రశంసల జల్లు: మ్యాచ్ నాణ్యతను పెంచేస్తాడని కామెంట్

కోహ్లీపై రిచర్డ్స్ ప్రశంసల జల్లు: మ్యాచ్ నాణ్యతను పెంచేస్తాడని కామెంట్
, సోమవారం, 6 జులై 2015 (10:16 IST)
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై వెస్టిండీస్ క్రికెట్ స్టార్ రిచర్డ్స్ ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియాకు ఉజ్వల భవిష్యత్తు ఉందని కామెంట్ చేశాడు.

జట్టు వన్డే, టీ20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పోలిస్తే విభిన్నంగా ఉండే కోహ్లీ సారథ్యంలో భారత క్రికెట్ అత్యున్నత శిఖరాలకు చేరనుందని కూడా రిచర్డ్స్ వెల్లడించాడు. 
 
మైదానంలో దూకుడుగా వ్యవహరించే కోహ్లీ, మ్యాచ్ నాణ్యతను పెంచేస్తాడని రిచర్డ్స్ పేర్కొన్నాడు. దూకుడుగా ఉంటూనే కోహ్లీ అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడని కితాబిచ్చాడు. కోహ్లీ బ్యాటింగ్ శైలి కూడా మెరుగ్గా ఉందని వివ్ రిచర్డ్స్ కొనియాడాడు.

Share this Story:

Follow Webdunia telugu