Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టెస్టు క్రికెట్‌లో అదుర్స్!: 400 వికెట్ల క్లబ్‌లో చేరిన డేల్ స్టెయిన్..!

టెస్టు క్రికెట్‌లో అదుర్స్!: 400 వికెట్ల క్లబ్‌లో చేరిన డేల్ స్టెయిన్..!
, గురువారం, 30 జులై 2015 (17:36 IST)
అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో మరో బౌలర్ 400 వికెట్ల క్లబ్‌లో చేరాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ రికార్డు సాధించాడు. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్‌ను పెవిలియన్‌‍కు పంపించడం ద్వారా స్టెయిన్ ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇదే సమయంలో 400 వికెట్ల క్లబ్‌లో చేరిన రెండో సఫారీ బౌలర్‌గా స్టెయిన్ అవతరించాడు. 80వ టెస్టులో స్టెయిన్ ఈ ఫీట్ నెలకొల్పాడు. 
 
అంతకుముందు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ షాన్ పొలాక్ (421) ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం టెస్ట్ కెరీర్ కొనసాగిస్తున్న ఆటగాళ్లలో హర్భజన్ (ఇండియా), జేమ్స్ అండర్సన్ (ఇంగ్లండ్)లు కూడా 400 వికెట్ల క్లబ్‌లో ఉండటం గమనార్హం. 400 వికెట్లు సాధించిన 13వ ఆటగాడిగా స్టెయిన్ రికార్డుకెక్కాడు.

Share this Story:

Follow Webdunia telugu