Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తనిష్ఠా ఛటర్జీతో బ్రెట్ లీ లిప్ లాక్: బ్రెట్ లీ నటన అద్భుతంగా ఉందట!

తనిష్ఠా ఛటర్జీతో బ్రెట్ లీ లిప్ లాక్: బ్రెట్ లీ నటన అద్భుతంగా ఉందట!
, శనివారం, 10 అక్టోబరు 2015 (10:47 IST)
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఆ దేశ సూపర్ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ నటుడిగా అదరగొట్టేశాడు. ఆన్ ఇండియన్ సినిమాలో బ్రెట్ లీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న బ్రెట్ లీ సరసన భారత నటీమణి తనిష్ఠా ఛటర్జీ నటించారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆస్ట్రేలియా వెళ్లిన భారత విద్యార్థులకు అక్కడి భాషను నేర్పడంతో పాటు ఆస్ట్రేలియా సంస్కృతిపై అవగాహన కల్పించే అధ్యాపకుడి పాత్రలో బ్రెట్ లీ నటన అద్భుతంగా ఉందని ప్రీమియర్ షో చూసినవారంతా కితాబిచ్చేశారు. 
 
బ్రెట్ లీ అధ్యాపకుడిగా అదరగొట్టేశాడని, తనిష్ఠా ఛటర్జీతో రొమాన్స్ కూడా సూపర్‌గా చేసేశాడని ప్రీమియర్ షో చూసినవారంతా చెప్తున్నారు. అంతేగాకుండా వీరిద్దరి మధ్య ఉన్న లిప్ లాక్ సీన్లు ప్రేక్షకులను బాగా అలరించనున్నాయి. వచ్చే గురువారం ఆస్ట్రేలియా వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ప్రీమియర్ షో నిన్న సిడ్నీలో జరిగింది. ఈ చిత్రాన్ని ‘ఆస్ట్రేలియా ఇండియా ఫిలిం ఫండ్’ నిర్మించింది. రూ.29 కోట్లతో నిర్మితమైన ఈ చిత్రానికి అనుపమ్ శర్మ దర్శకత్వం వహించారు.

Share this Story:

Follow Webdunia telugu