హమ్మయ్య ఇంగ్లండ్ గెలిచింది.. ఆప్ఘన్‌పై ఓదార్పు విజయం!

శుక్రవారం, 13 మార్చి 2015 (17:20 IST)
వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు ఓదార్పు విజయం సాధించింది. ప్రపంచ కప్‌లో భాగంగా శుక్రవారం ఆఫ్ఘనిస్థాన్ - ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో జరిగిన ఈ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌పై ఇంగ్లండ్ విజయం సాధించింది.
 
తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 36.2 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌కు పలుమార్లు వర్షం అంతరాయం కల్గించడంతో ఆఫ్ఘనిస్థాన్ ఇన్నింగ్స్‌ను 36.2 ఓవర్లకే కుదించారు. 
 
వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్‌కు 25 ఓవర్లు కుదించారు. ఇంగ్లండ్ 25 ఓవర్లలో 101 పరుగులు చేయాలి. అయితే 18.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 101 పరుగులు చేసి విజయం సాధించింది. కాగా ఇంగ్లండ్-ఆప్ఘన్ జట్లు టోర్నీ నుంచి వైదొలిగాయి.

వెబ్దునియా పై చదవండి