Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బంతి తగిలి కుప్పకూలిపోయిన ప్రజ్ఞాన్ ఓజా.. తలకు వెనుక భాగంలో?

భారత బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా మైదానంలో కుప్పకూలిపోయాడు. తలకు బంతి తగలడంతో వెంటనే ఓజాను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన దులీప్ ట్రోఫీలో భాగంగా గ్రేటర్ నోయిడాలో ఇండియా గ్రీన్, ఇండియా బ్లూ జట్ల మధ్య జరు

బంతి తగిలి కుప్పకూలిపోయిన ప్రజ్ఞాన్ ఓజా.. తలకు వెనుక భాగంలో?
, గురువారం, 8 సెప్టెంబరు 2016 (16:15 IST)
భారత బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా మైదానంలో కుప్పకూలిపోయాడు. తలకు బంతి తగలడంతో వెంటనే ఓజాను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన దులీప్ ట్రోఫీలో భాగంగా గ్రేటర్ నోయిడాలో ఇండియా గ్రీన్, ఇండియా బ్లూ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో జరిగింది. ఇండియా గ్రీన్ జట్టు తరపున ఓజా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో.. అతనికి తలకు వెనుక భాగంలో బాల్ తగిలింది.
 
బౌలర్ జలజ్ సక్సేనా వేసిన బంతిని ఇండియా బ్లూ జట్టు ఆటగాడు పంకజ్ సింగ్ మిడాన్ మీదుగా షాట్ కొత్తగా.. ఫీల్డింగ్ చేస్తున్న ఓజా వైపునకు ఊహించని విధంగా బాల్ రావడంతో అతను వెనక్కి తిరిగాడు. దీంతో తల వెనుక భాగంలో బంతి బలంగా తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఓజాకు ఎలాంటి ప్రమాదం లేదని.. నివేదికల ద్వారా తెలిసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లుంగీ ధరించిన సచిన్... పక్కనే చిరంజీవి, నాగార్జున... ఎందుకో తెలుసా?