Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హ్యూస్ బాటలో తమిళ సంతతి క్రికెటర్ బవలన్ పద్మనాభన్ మృతి

హ్యూస్ బాటలో తమిళ సంతతి క్రికెటర్ బవలన్ పద్మనాభన్ మృతి
, మంగళవారం, 7 జులై 2015 (19:31 IST)
తమిళ సంతతి క్రికెటర్ బవలన్ పద్మనాభన్ (24) మృత్యువాత పడ్డాడు. దీంతో క్రికెట్ ప్రపంచం మరోసారి విషాదంలో మునిగిపోయింది.

బవలన్ పద్మనాభన్ (24) అనే క్రికెటర్ సర్రే కౌంటీలో నిర్వహించిన బ్రిటీష్ తమిళ్ లీగ్‌లో మణిపాయ్ పారిష్ స్పోర్ట్స్ క్లబ్ తరపున ఆడుతుండగా ఈ ఘటన జరిగింది. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బంతి అతని ఛాతికి బలంగా తాకడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. 
 
ప్రాథమిక చికిత్స అనంతరం అతడిని హుటాహుటీన ఎయిర్ అంబులెన్స్‌లో కింగ్ స్టన్ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. బలమైన దెబ్బతగలడంతో పద్మనాభన్ ప్రాణాలు విడిచాడు. హార్ట్ ఫెయిల్యూర్ కారణంగానే మరణించివుంటాడని వైద్యులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu