Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డెఫ్ అండ్ డమ్ క్రికెట్ వరల్డ్ కప్.. ఇమ్రాన్ షేక్.. కచోరీ షాపు పెట్టుకున్నాడు!

డెఫ్ అండ్ డమ్ క్రికెట్ వరల్డ్ కప్.. ఇమ్రాన్ షేక్.. కచోరీ షాపు పెట్టుకున్నాడు!
, ఆదివారం, 29 నవంబరు 2015 (18:34 IST)
డెఫ్ అండ్ డమ్ క్రికెట్ వరల్డ్ కప్ భారత్‌కు సంపాదించిపెట్టడంలో కీలక పాత్ర పోషించిన ఇమ్రాన్ షేక్.. ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు గుజరాత్‌లోని వడోదరలోని ఓల్డ్ పంద్రా రోడ్డు న్యూట్రీషియన్ మూంగ్ కచోర్ దాల్ స్టాల్‌ను పెట్టేసుకున్నాడు. తన ఆటతీరుతో భారత జట్టుకు విజయాలు సాధించి పెట్టి.. కెప్టెన్‌గానూ రాణించిన ఆటగాడు ఇలా కచోరీ షాపు పెట్టుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. 
 
అయితే ఇందులో తప్పులేదని, క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టమని.. కుటుంబ బాధ్యతల నేపథ్యంలో ఆర్థికంగా నిలదొక్కుకోవడం అత్యవసరమని, అందుకే తన భార్య రోజాతో కలిసి మూంగ్ దాల్ కచోరీ షాపు పెట్టుకున్నట్టు ఇమ్రాన్ షేక్ వెల్లడించాడు.

Share this Story:

Follow Webdunia telugu