Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్ట్రేలియాదే... ప్రపంచకప్

ఆస్ట్రేలియాదే... ప్రపంచకప్
, సోమవారం, 30 మార్చి 2015 (07:09 IST)
ఆసీస్... ప్రపంచకప్ ఫైనల్లో విశ్వరూపం చూపించింది. ఫైనల్స్ లో కివీస్ ను చిత్తు చిత్తు చేసింది. మ్యాచ్ లో అడుగడుగున ఆధిక్యతను ప్రదర్శించింది. ఏ దశలో న్యూజీల్యాండ్ కు అవకాశం ఇవ్వలేదు. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగులోనూ తమదే పైచేయి చేసి చూపించారు. ఆదివారం ఎంసీజీ మైదానంలో జరిగిన ఫైనల్లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో కివీస్‌పై ఘన విజయం సాధించి ఐదోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. తొలత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 45 ఓవర్లలో 183 పరుగులకే ఆలౌటైంది. 
 
బ్యాటింగుకు దిగన ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఇలియట్ (82 బంతుల్లో 83; 7 ఫోర్లు, 1 సిక్స్) ఫామ్‌ను కొనసాగించారు. టేలర్ (72 బంతుల్లో 40; 2 ఫోర్లు) సమయోచితంగా ఆడాడు. తర్వాత ఆస్ట్రేలియా 33.1 ఓవర్లలో 3 వికెట్లకు 186 పరుగులు చేసి నెగ్గింది. కెప్టెన్ క్లార్క్ (72 బంతుల్లో 74 ; 10 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడగా, స్మిత్ (71 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు), వార్నర్ (46 బంతుల్లో 45; 7 ఫోర్లు) నిలకడగా ఆడారు. ఫాల్క్‌నర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’; స్టార్క్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించాయి.
 
స్కోరు వివరాలు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (బి) మ్యాక్స్‌వెల్ 15; మెకల్లమ్ (బి) స్టార్క్ 0; విలియమ్సన్ (సి) అండ్ (బి) జాన్సన్ 12; టేలర్ (సి) హాడిన్ (బి) ఫాల్క్‌నర్ 40; ఇలియట్ (సి) హాడిన్ (బి) ఫాల్క్‌నర్ 83; అండర్సన్ (బి) ఫాల్క్‌నర్ 0; రోంచీ (సి) క్లార్క్ (బి) స్టార్క్ 0; వెటోరి (బి) జాన్సన్ 9; సౌతీ రనౌట్ 11; హెన్రీ (సి) స్టార్క్ (బి) జాన్సన్ 0; బౌల్ట్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: (45 ఓవర్లలో ఆలౌట్) 183.
వికెట్ల పతనం: 1-1; 2-33; 3-39; 4-150; 5-150; 6-151; 7-167; 8-171; 9-182; 10-183.
బౌలింగ్: స్టార్క్ 8-0-20-2; హాజల్‌వుడ్ 8-2-30-0; జాన్సన్ 9-0-30-3; మ్యాక్స్‌వెల్ 7-0-37-1; ఫాల్క్‌నర్ 9-1-36-3; వాట్సన్ 4-0-23-0.
 
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి) ఇలియట్ (బి) హెన్రీ 45; ఫించ్ (సి) అండ్ (బి) బౌల్ట్ 0; స్మిత్ నాటౌట్ 56; క్లార్క్ (బి) హెన్రీ 74; వాట్సన్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: (33.1 ఓవర్లలో 3 వికెట్లకు) 186.
వికెట్ల పతనం: 1-2; 2-63; 3-175.
బౌలింగ్: సౌతీ 8-0-65-0; బౌల్ట్ 10-0-40-1; వెటోరి 5-0-25-0; హెన్రీ 9.1-0-46-2; అండర్సన్ 1-0-7-0.
 

Share this Story:

Follow Webdunia telugu