Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరల్డ్ కప్ : వెస్టిండీస్‌తో దక్షిణాఫ్రికా ఢీ.. ఆదిలోనే ఫస్ట్ వికెట్ డౌన్!

వరల్డ్ కప్ : వెస్టిండీస్‌తో దక్షిణాఫ్రికా ఢీ.. ఆదిలోనే ఫస్ట్ వికెట్ డౌన్!
, శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (10:13 IST)
వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లలో భాగంగా గ్రూప్-బీలో అగ్రశ్రేణి జట్టు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీల ఇన్నింగ్స్‌ను హషీమ్ ఆమ్లా, డికాక్‌తో కలిసి ప్రారంభించాడు. అయితే ఆరో ఓవర్‌లోనే సఫారీ ఓపెనర్ డికాక్ (12) జాసన్ హోల్డింగ్ బౌలింగ్‌లో ఓటయ్యాడు. 
 
దీంతో ఆదిలోనే సఫారీలకు వెస్టిండీస్ షాకిచ్చినట్లైంది. ఇప్పటికే భారత జట్టు చేతిలో ఘోర పరాజయం నేపథ్యంలో ఈ మ్యాచ్ గెలిచి సత్తా చాటాలని సఫారీలు భావిస్తుండగా, జింబాబ్వేతో మ్యాచ్‌లో క్రిస్ గేల్ తిరిగి ఫామ్‌లోకి రావడంతో రెట్టించిన ఉత్సాహంతో విండీస్ బరిలోకి దిగింది. 15 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి దక్షిణాఫ్రికా 58 పరుగులు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu