Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ : టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ.. తిలక్ వర్మకు గాయాలు

Advertiesment
Tilak varma

ఠాగూర్

, గురువారం, 8 జనవరి 2026 (11:36 IST)
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు టీమ్ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్యాటర్ తిలక్ వర్మకు గాయమైంది. ఆయన పొట్ట కింది భాగంలో దెబ్బతగిలింది. దీంతో అతనికి ఆపరేషన్ చేశారు. ఈ కారణంగా ఆయన కోలుకోవడానికి ఇంకా కొన్ని వారాల సమయం పట్టొచ్చు అని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే జనవరి 21 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌కు ఈ హైదరాబాదీ క్రికెటర్ దూరమయ్యాడు. 
 
ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్‌ మ్యాచ్‌లు రాజ్‌కోట్‌లో జరుగుతున్నాయి. హైదరాబాద్‌ జట్టుకు తిలక్ వర్మ నాయకత్వం వహిస్తుండగా.. ఇటీవల అతనికి పొట్ట కింది భాగంలో తీవ్రమైన నొప్పి వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి స్కానింగ్ చేయించారు. 
 
తక్షణమే శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు. దీంతో తిలక్‌‌కు సర్జరీ చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది. దీంతో మూడు, నాలుగు వారాలు ఆటకు దూరమయ్యే అవకాశం ఉంది. ఫలితంగా కివీస్‌తో టీ20 సిరీస్‌కు ఈ కుర్రాడు అందుబాటులో ఉండడు. అతని స్థానంలో ఇప్పటివరకు మరొకరిని జట్టులోకి తీసుకోలేదు. ఏది ఏమైనా కొంతకాలంగా జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న తిలక్ టీ20 ప్రపంచ కప్ ముందు గాయపడటం టీమిండియాకు భారీ దెబ్బే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిలక్ వర్మకు శస్త్రచికిత్స.. కడుపులో నొప్పి రావడంతో అత్యవసరంగా?