Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన జేమ్స్ ఫాల్కనర్: వన్డే సిరీస్‌‌లో నో ప్లేస్

డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన జేమ్స్ ఫాల్కనర్: వన్డే సిరీస్‌‌లో నో ప్లేస్
, ఆదివారం, 5 జులై 2015 (14:16 IST)
మాంచెస్టర్‌‌లో ఆస్ట్రేలియా క్రికెటర్ జేమ్స్ ఫాల్కనర్ డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డాడు. దీంతో అతనిని న్యాయస్థానం ఎదుట పోలీసులు హాజరు పరిచారు. దీంతో జేమ్స్ ఫాల్కనర్‌కు కోర్టు బెయిల్ మంజూరా చేయడంతో పాటు ఈ నెల 21న హాజరు కావాలని ఆదేశించింది. 
 
అయితే క్రికెట్ ఆస్ట్రేలియా ఫాల్కనర్ చర్య పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. యువ క్రికెటర్లకు ఆదర్శంగా ఉండాల్సిన సీనియర్లు తప్పుదోవపట్టడం సరికాదని ఫాల్కనర్ హెచ్చరించారు. తప్పతాగి వాహనాలు నడపడంలో ఉండే నష్టాలను గుర్తించాలని ఫాల్కనర్‌కు సూచించినట్టు ఆసీస్ క్రికెట్ జట్టు పెర్ఫార్మెన్స్ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ పాట్ హోవార్డ్ చెప్పారు. కాగా, షేన్ వార్న్, మైఖేల్ క్లార్క్ గతంలో తాగి వివాదాలు రేపినట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. 
 
ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. ఇంగ్లండ్‌తో ఐదు వన్డేలు, ఐదు టెస్టులు ఆడనుంది. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్‌కు జేమ్స్ ఫాల్కనర్ దూరమయ్యే ఛాన్సుందని సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu