Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జోరూట్‌ను ఎందుకు కొట్టానంటే.. గడ్డానికి విగ్గు పెట్టాడు అందుకే: వార్నర్

జోరూట్‌ను ఎందుకు కొట్టానంటే.. గడ్డానికి విగ్గు పెట్టాడు అందుకే: వార్నర్
, ఆదివారం, 5 జులై 2015 (16:50 IST)
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇంగ్లండ్ ఆటగాడు జోరూట్‌పై చేజేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం జరిగి రెండేళ్లు గడిచాయి. జోరూట్‌పై చేజేసుకున్న డేవిడ్ వార్నర్ అప్పట్లో రెండు టెస్టుల నిషేధం ఎదుర్కొన్నాడు.

బుధవారం నుంచి యాషెస్ సిరీస్ మొదలు కావాల్సి ఉండగా వార్నర్ గడిచిపోయిన వివాదాన్ని మరోసారి గుర్తు చేశాడు. అప్పుడు తాను జో రూట్‌ను ఎందుకు కొట్టానో తెలుసా? అంటూ మీడియాకు చెప్పాడు. 
 
బార్‌లో ఆసీస్ జట్టు కూర్చుని కాక్ టైల్ పార్టీ చేసుకుంటోంది. అదే బార్‌లో ఇంగ్లండ్ జట్టు సభ్యులు కూడా పార్టీ చేసుకుంటున్నారట. ఆసీస్ ఆటగాడు మలింగ జుత్తును పోలిన విగ్ పెట్టుకుని ఉండగా, జో రూట్ వచ్చి ఆ విగ్గు తీసి తన గడ్డానికి పెట్టాడని, అది తనకు నచ్చలేదన్నాడు. అయితే అలా పెట్టడం వెనుక జో రూట్ సరదాగా పీల్ అయి ఉండొచ్చని, తాను మాత్రం దానిని సరదాగా తీసుకోలేకపోయానని, అందుకే కొట్టానని వార్నర్ చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu