అర్జున అవార్డు గ్రహీత రెజ్లర్ పూజా దండా ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో వివాహం చేసుకుంది. హిసార్‌లోని సుందర్ నగర్ నివాసి పూజా, అదే జిల్లాలోని ఘిరాయ్ గ్రామానికి చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బూరాను గురువారం వివాహం చేసుకుంది. బుడాపెస్ట్‌లో జరిగిన 2018 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 57 కిలోల విభాగంలో కాంస్య పతక విజేత అయిన పూజా, 2010 సమ్మర్ యూత్ ఒలింపిక్స్, 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం గెలుచుకుంది.
2014 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది. ఆమె ప్రస్తుతం హిసార్‌లోని మహావీర్ స్టేడియంలో హర్యానా క్రీడా విభాగంలో సీనియర్ రెజ్లింగ్ కోచ్‌గా పనిచేస్తోంది. ఆమె తండ్రి అజ్మీర్ ధండా హిసార్‌లోని హర్యానా పశుసంవర్ధక శాఖ నుండి పదవీ విరమణ చేశారు.
భవిష్యత్ ఒలింపిక్స్‌లో యువ అథ్లెట్లకు శిక్షణ ఇవ్వడంపై దృష్టి సారించింది. వివాహం తర్వాత కూడా తాను రెజ్లింగ్‌లో చురుకుగా పాల్గొంటానని పూజా చెప్పింది. అనేక మంది క్రీడాకారులు, రాజకీయ నాయకులు, అధికారులు ఈ వేడుకకు హాజరయ్యారు.
హిసార్ జిల్లాలోని బుడానా గ్రామంలో జన్మించిన పూజ, 2009లో రెజ్లింగ్‌కు మారడానికి ముందు మహావీర్ స్టేడియంలో జూడోలో తన క్రీడా ప్రయాణాన్ని ప్రారంభించింది. జూడోలో అనేక అంతర్జాతీయ పతకాలు గెలుచుకున్నప్పటికీ, రెజ్లింగ్‌ను కెరీర్‌గా తీసుకోవాలని ఆమెకు మాజీ భారత రెజ్లర్, కోచ్ కృపాశంకర్ బిష్ణోయ్ సలహా ఇచ్చారు. దీంతో రెజ్లింగ్‌లో రాణించింది.