Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనుష్క-కోహ్లీల పెళ్లి ఇప్పుడే కాదు.. అవన్నీ పుకార్లే నమ్మకండి!

అనుష్క-కోహ్లీల పెళ్లి ఇప్పుడే కాదు.. అవన్నీ పుకార్లే నమ్మకండి!
, బుధవారం, 28 అక్టోబరు 2015 (16:40 IST)
క్రికెటర్లందరూ పెళ్లి చేసేసుకుని ఓ ఇంటివాళ్లైపోతున్న తరుణంలో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వివాహం మాత్రం ఇప్పట్లో లేనట్టేనని తేలిపోయింది. బాలీవుడ్ మద్దుగుమ్మ అనుష్క శర్మ ఇప్పట్లో పెళ్లి చేసుకోనని స్టేట్మెంట్ ఇవ్వడంతో కోహ్లీ డలైపోయాడు. అనుష్క శ్రమ, విరాట్ కోహ్లీలు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రియుడు కోహ్లీతో పాటు తన తండ్రితో కలిసి అనుష్క కనిపించడంతో.. త్వరలోనే కోహ్లీ.. అనుష్క శర్మల పెళ్లి భాజాలు మోగనున్నాయని జోరుగా ప్రచారం సాగింది. 
 
అంతేగాకుండా విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు ఇప్పటికే ఇంటికోసం గాలిస్తున్నారని.. వీరిద్దరి కుటుంబాలు త్వరలోనే కలిసి వివాహ తేదీని ఖరారు చేస్తాయని వార్తలొచ్చాయి. అయితే, ఈ వార్తలన్నీ కేవలం పుకార్లేనని, వాటిని నమ్మరాదని అనుష్క శర్మ ప్రతినిధి ప్రకటించాడు. 
 
ప్రస్తుతం వరుస సినిమాలతో అనుష్క చాలా బిజీగా ఉందని... కెరీర్, జీవితం గురించి ఆమెకు పూర్తి స్పష్టత ఉందని తెలిపాడు. సమయం వచ్చినప్పుడు తన పెళ్లి గురించి అనుష్కే చెబుతుందన్నాడు. కాగా ఈ ఏడాది అనుష్క ఎన్‌హెచ్10, బాంబే వెల్వెట్, దిల్ ధడక్నే డు వంటి సినిమాల్లో నటించి హిట్ కొట్టేసిన అనుష్క శర్మ.. ప్రస్తుతం కరణ్ జోహార్-రణ్‌బీర్ కపూర్ చిత్రంలో నటిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu