Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనిల్ కుంబ్లేకు అరుదైన గౌరవం: ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో..

అనిల్ కుంబ్లేకు అరుదైన గౌరవం: ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో..
, గురువారం, 19 ఫిబ్రవరి 2015 (19:45 IST)
మాజీ ఇండియన్ క్రికెటర్ అనిల్ కుంబ్లేని అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో కుంబ్లేకి ఐసీసీ సభ్యత్వం కల్పించింది. అనిల్ కుంబ్లేతో పాటు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ మాజీ మహిళా క్రికెటర్ బెట్టీ విల్సన్‌కు కూడా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటుకల్పించింది.
 
ఇకపోతే.. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో 77వ సభ్యుడిగా అనిల్ కుంబ్లేకి స్థానం కల్పిస్తున్నట్టు ఐసీసీ తెలిపింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అంటే సుదీర్ఘ కాలం క్రికెట్‌ను కొనసాగించి, అత్యున్నత శిఖరాలు అధిరోహించిన అతి కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే దీనిలో సభ్యత్వం కల్పిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu