Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డివిలియర్స్ అదుర్స్: సచిన్, గంగూలీలను బీట్ చేసిన ఏబీ..8వేల రన్స్‌తో..

డివిలియర్స్ అదుర్స్: సచిన్, గంగూలీలను బీట్ చేసిన ఏబీ..8వేల రన్స్‌తో..
, గురువారం, 27 ఆగస్టు 2015 (12:41 IST)
సౌత్ ఆఫ్రికా క్రికెట్ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలను అధిగమించాడు. అతి తక్కువ వన్డే ఇన్నింగ్స్ లలో 8వేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్ మెన్ గా ఏబీ అవతరించాడు. ఇప్పటికే వన్డే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ, ఫాస్టెస్ట్ సెంచరీ, ఫాస్టెస్ట్ 150 రన్స్ రికార్డులు కూడా డివిలియర్స్ పేరిట ఉన్నాయి. తాజాగా ఏబీ డివిలియర్స్ అరుదైన ఘనత సాధించారు. 
 
బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డేలో హాఫ్ సెంచరీ (64) సాధించిన సందర్భంగా ఏబీ ఈ రికార్డును సాధించాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలను అధిగమించాడు.
 
8వేల పరుగుల మైలు రాయిని అందుకోవడానికి డివిలియర్స్ కు కేవలం 182 ఇన్నింగ్స్ మాత్రమే పట్టింది. అంతకుముందు ఈ రికార్డ్ భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (200 ఇన్నింగ్స్) పేరిట ఉంది. సచిన్ ఈ ఫీట్‌ను 210 ఇన్నింగ్స్‌లలో సాధించడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu