Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తొలి డే అండ్ నైట్ టెస్ట : అడిలైడ్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా గెలుపు

తొలి డే అండ్ నైట్ టెస్ట : అడిలైడ్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా గెలుపు
, సోమవారం, 30 నవంబరు 2015 (10:48 IST)
వరల్డ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా తిరుగులేని ముద్రవేసింది. అడిలైడ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ చరిత్రాత్మక విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆసీస్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసి జయకేతనం ఎగురవేసింది. 
 
ఆసీస్ బ్యాట్స్‌మెన్ షాన్ మార్ష్ మిడిలార్డర్‌లో 49 పరుగులతో రాణించడంతో ఆస్ట్రేలియా లక్ష్యాన్ని చేరుకోగలిగింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన డేవిడ్ వార్నర్ 37 బంతుల్లోనే నాలుగు ఫోర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. అడమ్ వోజెస్, మిచెల్ మార్ష్ చెరో 28 రన్స్‌తో చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. ఆసీస్ టాప్ఆర్డర్‌ను హడలెత్తించిన న్యూజిలాండ్ బౌలర్లు చివరి వరకు ఆ జోరు కొనసాగించలేకపోయారు. ఫలితంగా ఆసీస్ ఆటగాళ్లు విజయాన్ని చేరుకోగలిగారు. కివీస్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్ 5 వికెట్లు తీయగా బ్రాస్‌వెల్, సాంటనర్ చెరో వికెట్ తీశారు. 
 
అంతకుముందు 116/5 ఓవర్‌నైట్ స్కోరుతో  బ్యాటింగ్ ఆరంభించిన న్యూజిలాండ్ 208 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాట్స్‌మెన్లు శాంటర్ 45, బ్రాస్‌వెల్ 27 పరుగులతో రాణించడంతో ఆస్ట్రేలియాకు ఈ స్కోరు నిర్దేశించగలిగింది. రెండో ఇన్నింగ్స్‌లో రాస్ టేలర్ 32, మెక్‌కలమ్ 20 మాత్రమే చెప్పుకోదగ్గ రన్స్ చేశారు. ఆస్ట్రేలియా బౌలర్ హేజిల్‌వుడ్ పింక్ కలర్ బాల్‌తో విజృంభించి కివీస్‌ను 208 పరుగులకు ఆలౌట్ చేయడంలో మెయిన్‌రోల్ పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో హేజిల్‌వుడ్ ఒక్కడే ఏకంగా ఆరు వికెట్లు తీసి కివీస్ దూకుడుకు బ్రేక్ వేశాడు. మిచెల్ మార్ష్ మూడు వికెట్లు తీయగా నాథన్ లియాన్ ఒక వికెట్ తీసి కివీస్ ఆటగాళ్ళను కట్టడి చేశారు. 
 
టెస్ట్ సంక్షిప్త స్కోరు వివరాలు 
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 202
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరు 224
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ స్కోరు 208
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ స్కోరు 187 

Share this Story:

Follow Webdunia telugu