45 యేళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా టీకా : కేంద్రం

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (17:11 IST)
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. దేశంలో కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వీలైనంత వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సన్నద్ధమవుతోంది. 
 
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ ఇస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. అర్హులైన వారు తమ వివరాలు నమోదు చేసుకుని వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. 
 
వ్యాక్సిన్ విషయంలో భయాందోళనలు అక్కర్లేదని స్పష్టం చేశారు. దేశంలో కరోనా వ్యాక్సిన్లకు కొరత లేదని జవదేకర్ వివరించారు.
 
మరోపక్క, దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు దేశంలో 4.85 కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇచ్చామని తెలిపారు. రెండో విడతలో 80 లక్షల మంది వ్యాక్సిన్ పొందారని వివరించారు. 
 
గత 24 గంటల్లో 32.54 లక్షల మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్టు జవదేకర్ పేర్కొన్నారు. ఫిబ్రవరి మాసంలో సగటున రోజుకు 3.77 లక్షల మందికి వ్యాక్సిన్లు ఇచ్చామని చెప్పారు.
 
ఇదిలావుంటే, దేశంలో 24 గంట‌ల్లో 40,715 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసింది. 
 
వాటి ప్రకారం... కొత్త‌గా 29,785 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,16,86,796కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 199 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,60,166కు పెరిగింది. 
 
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,11,81,253 మంది కోలుకున్నారు. 3,45,377 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 4,84,94,594 మందికి వ్యాక్సిన్లు వేశారు.
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 23,54,13,233 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 9,67,459 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవర్ స్టార్ హీరో అనగానే కథ కూడా వినలేదు : రాశీఖన్నా

సెలెబ్రిటీల జీవితాల్లో ఏం జరుగుతుందో తొంగి చూసే సంస్కృతి పెరిగిపోతోంది : నటి ఖుష్బూ

ఉగాది పురస్కారాల్లో మూడు అవార్డ్ లు గెల్చుకున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా

హ్యాపీ రాజ్ నుంచి జివి ప్రకాష్ కుమార్, శ్రీ గౌరీ ప్రియ పై అద్దిరా లెక్క సాంగ్ రిలీజ్

'కేడీ: ది డెవిల్' మూవీలోని పాటను తొలగించండి : కేంద్రం ఆదేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సాహస యాత్రలపై నాట్స్ అవగాహన సదస్సు

షి ద ఛేంజ్ 2026: హైదరాబాద్‌కు చెందిన శ్రీదేవి జాస్తికి స్విగ్గీ వారు సన్మానం

వేసవిలో పెరుగు, మజ్జిగ: ప్రయోజనాలు ఏమిటి?

భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ కోసం సైన్స్-పరిశోధనలను ముందుకు తీసుకెళ్లాలి: డాక్టర్ అంజిరెడ్డి స్మారక ఉపన్యాసం

శరీర బరువు పెరిగితే వచ్చే వ్యాధులు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments