కావలసిన పదార్థాలు :
లేత వంకాయలు... పావు కేజీ
కొత్తిమీర పొడి... ఒక టీ.
జీలకర్ర పొడి... పావు టీ.
పసుపు... పావు టీ.
కారం... పావు టీ.
ఉప్పు... ఒక టీ.
పంచదార... ఒక టీ.
నూనె... మూడు టీ.
తయారీ విధానం :
కొత్తిమీర పొడి, జీలకర్ర పొడి, పసుపు పొడి, కారంపొడి, ఉప్పు, పంచదారలను ఒక గిన్నెలోకి తీసుకుని కలుపుకోవాలి. వంకాయలకు అడ్డంగా అంగుళం లోతున గాట్లు పెట్టాలి. ఈ పొడుల మిశ్రమాన్ని వంకాయల గాట్లలోపల కూరి ఉంచాలి.
నాన్‌స్టిక్ పాన్‌లో నూనె పోసి అందులో ఈ వంకాయల్ని వేసి గరిటెతో కదుపుతూ కొద్దిసేపు వేయించి మూతపెట్టాలి. తరువాత మంట తగ్గించి 15 నిమిషాలు మగ్గనిచ్చి దించేయాలి. అంతే ఘుమఘుమలాడే స్టఫ్డ్ బ్రింజాల్ రెడీ అయినట్లే...!