కావలసిన పదార్థాలు :
ఆరెంజ్... రెండు
దానిమ్మపండ్లు... మూడు
పంచదార... ఆరు టీ.
చల్లటినీరు... 200 ఎం.ఎల్.
తయారీ విధానం :
ఆరెంజ్ పై తొక్క, లోపలి గింజలు తీసివేసి.. తొనలను విడిగా పెట్టుకోవాలి. దానిమ్మ పై తొక్క తీసి గింజలు ఒలుచుకోవాలి. ఆరెంజ్ తొనలు, దానిమ్మ గింజలు, చల్లటినీరు, పంచదార కలిపి మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. ఈ జ్యూస్‌ను గ్లాసుల్లో పోసి అవసరమయితే ఐస్ ముక్కలు వేసుకుని తాగాలి. అంతే సిట్రస్ ఆరెంజ్ మ్యాజిక్ సిద్ధమైనట్లే...!
ఈ జ్యూస్‌లో ప్రోటీన్లు, విటమిన్ సి, కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల ఇది అన్ని వయసులవారికీ మేలు చేస్తుంది. కొవ్వు పదార్థాలు ఏ మాత్రం లేకపోవడంతో ఊబకాయులు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఎముకల బలానికి కాల్షియం ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి, ఈ జ్యూస్‌లో కాల్షియం పుష్కళంగా లభిస్తుంది.