కావలసిన పదార్థాలు :
వెనిల్లా ఐస్‌క్రీమ్... అర కప్పు
రోజ్ సిరప్... అర కప్పు
సబ్జా విత్తనాలు... పావు కప్పు
పొడి చేసిన ఐస్... అరకప్పు
సోడా... తగినంత
తయారీ విధానం :
రోజ్‌సిరప్ కలిపిన వెనిల్లా ఐస్‌క్రీమ్‌ను మిక్సీలో వేసి కొద్దిగా బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పొడవైన గ్లాసులో పొడి చేసిన ఐస్‌ను ముందుగా వేసి దానిపై, బ్లెండ్ చేసిన ఐస్‌క్రీమ్‌ని ఉంచాలి. ముందుగా నానబెట్టి ఉంచుకున్న సబ్జా విత్తనాలను ఐస్‌క్రీమ్‌కి జోడించాలి.
ఇప్పుడు దీనికి సోడాను కలిపితే వెనిల్లా ఐస్‌క్రీమ్ పింక్ పంచ్ తయారయినట్లే..! గ్లాసుకు ఓ వైపు నిమ్మచెక్కతో అలంకరించినట్లయితే చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటుంది.