కావలసిన పదార్థాలు :
గోధుమపిండి... ఒక కప్పు
సోయాపిండి... అర కప్పు
సెనగ పిండి... నాలుగు టీ.
కొత్తిమీర తురుము... పావు కప్పు
ఉప్పు... తగినంత
పెరుగు... పావు కప్పు
పసుపు... పావు టీ.
జీలకర్ర పొడి... రెండు టీ.
వేరుశెనగ పొడి... ఆరు టీ.
నూనె... తగినంత
తయారీ విధానం :
గోధుమపిండిలో సోయాపిండి, సెనగపిండి, జీలకర్ర పొడి, కొత్తిమీర తురుము, ఉప్పు, పసుపు, వేరుశెనగ పొడి, ఉప్పు... అన్నీ కలిపి కొద్దిగా నీళ్లు చల్లి మెత్తగా చపాతీపిండిలా కలపాలి. దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని పెనంమీద కొద్దిగా నూనె వేస్తూ రెండువైపులా ఎర్రగా కాల్చాలి. అంతే వీట్ సోయా స్పెషల్ తెప్లా రెడీ అయినట్లే...!
వీటిని పెరుగుతోగానీ, కొబ్బరి చట్నీతోగానీ తింటే చాలా రుచిగా ఉంటాయి. ప్రోటీన్లూ, కార్బొహైడ్రేట్లూ పుష్కలంగా ఉన్న తెప్లా అన్ని వయసులవారికీ ఆరోగ్యకరమైన ఆహారం అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరూ ట్రై చేయండి.