వానల్లో "టొమాటో ఎగ్ డ్రాప్ సూప్"తో మజా..!
కావలసిన పదార్థాలు :చికెన్ స్టాక్.. ముప్పావు లీ.కోడిగుడ్లు... రెండుటొమోటోలు... రెండుపాలకూర.. ఒక కట్టఉప్పు... తగినంతపంచదార.. ఒక టీ.మిరియాలపొడి.. కాస్తంతతయారీ విధానం :చికెన్ స్టాక్‌ను మరిగించాలి. అది మరుగుతుండగానే సన్నగా తరిగిన టొమాటోలు, పాలకూర వేసి ఉడికించాలి. ఉప్పు, మిరియాల పొడి కూడా వేసి కలపాలి. కోడిగుడ్డు సొనను పైపైన గిలకొట్టి, సూప్‌లో వేసి... నెమ్మదిగా గరిటెతో కలపాలి. కోడిగుడ్డుసొనను కలిపిన తరువాత సూప్‌ను మరిగించకూడదు. వేడివేడిగా వడ్డించాలి. అంతే చల్లటి వానల్లో వెచ్చగా, హాయిగా అలరించే టొమాటో ఎగ్ డ్రాప్ సూప్ రెడీ..!