Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రక్తహీనతకు "జాగరీ జిల్"తో చెక్...!

రక్తహీనతకు
FILE
కావలసిన పదార్థాలు :
బెల్లం... 200 గ్రా.
అల్లం... చిన్నముక్క
మిరియాలపొడి... 4 టీ.
నిమ్మరసం... 8 టీ.
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
ఎనిమిది కప్పుల నీటిలో బెల్లాన్ని కరిగించాలి. అల్లాన్ని కచ్చాపచ్చాగా దంచి, బెల్లం నీటిలో కలపాలి. మిరియాలపొడి, నిమ్మరసం, తగినంత ఉప్పు కూడా అందులో కలపాలి. ఈ నీటిని వడగట్టి సర్వ్ చేయాలి. అంతే తియ్యతియ్యగా ఉండే జాగరీ జిల్ తయారైనట్లే...!

బెల్లంలో అధికమోతాదులో ఐరన్ ఉండటంవల్ల రక్తహీనతను దరిచేరనివ్వదు. మిరియాలలో ఉండే క్యాల్షియం ఎముకల ఆరోగ్యానికి సహకరిస్తుంది. అల్లం జీర్ణ క్రియను సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. ఇక నిమ్మరసంలో ఉండే విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంటుతుంది. కాబట్టి.. జాగరీ జిల్ త్వరగా తయారవటమేగాకుండా, ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలుచేస్తుందన్నమాట...!

Share this Story:

Follow Webdunia telugu