కావలసిన పదార్థాలు :
మ్యాకరోని పాస్తా... 200 గ్రా.
క్యారెట్... వంద గ్రా.
రెడ్ పెప్పర్... వంద గ్రా.
గ్రీన్ పెప్పర్... 50 గ్రా.
ఎల్లో పెప్పర్... 50 గ్రా.
మెయొనైజ్... వంద గ్రా.
టొమోటో కెచప్... 20 గ్రా.
ఉప్పు... తగినంత
తెల్ల మిరియాలపొడి... 4 గ్రా.
నూనె... 8 గ్రా.
సన్నగా తరిగిన టొమోటో ముక్కలు... తగినన్ని
తయారీ విధానం :
మ్యాకరోని పాస్తాను తగినన్ని వేడినీళ్లలో వేసి ఉప్పు, నూనె కలిపి వడకట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు క్యారెట్ ముక్కలను, పాస్తాను కలిపి మెయొనైజ్తో డ్రెస్సింగ్ చేయాలి. ఒక పాత్రలో రెడ్ పెప్పర్, గ్రీన్ పెప్పర్, ఎల్లో పెప్పర్, టొమోటో కెచప్, ఉప్పు, తెల్ల మిరియాలపొడి, నూనె కలిపిన పదార్థాలన్నింటినీ ఒక బౌల్లో వేసి కలిపి, సన్నగా తరిగిన టొమోటో ముక్కలతో గార్నిష్ చేసి పాస్తాతో కలిపి వడ్డించాలి.