"మష్రూమ్ నూడుల్స్"తో మజా మజా..!
కావలసిన పదార్థాలు :పచ్చిబఠాణీలు... అర కప్పువెన్న.. రెండు టీ.అల్లంవెల్లుల్లి ముద్ద... ఒక టీ.ఉల్లిపాయ తరుగు... అర కప్పుక్యాప్సికం తరుగు... అర కప్పుపుట్టగొడుగులు... పావు కేజీఉప్పు... తగినంతమిరియాలపొడి.. ఒక టీ.సోయాసాస్... ఒక టీ.కార్న్‌ఫ్లోర్ పేస్ట్... ఒక టీ.నూడుల్స్... ఒక పాకెట్గ్రీన్ గార్లిక్ సాస్.. రెండు టీ.తయారీ విధానం :బఠాణీలను ముందుగానే నానబెట్టి ఉడికించి ఉంచాలి. స్టవ్ మీద బాణలి పెట్టి వెన్న వేసి, కరిగించాలి. అందులో అల్లంవెల్లుల్లి ముద్ద, చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలు, క్యాప్సికమ్, పుట్టగొడుగులు వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. విడిగా ఉడికించి ఉంచిన పచ్చి బఠాణీలు, ఉప్పు, మిరియాలపొడిలను కూడా వేసి బాగా కలపాలి.సోయాసాస్, కార్న్‌ఫ్లోర్ పేస్టు కూడా వేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. చిక్కగా అయిన తర్వాత ఉడికించిన నూడుల్స్, గ్రీన్ గార్లిక్ సాస్ కలిపి దించేయాలి. అంతే వేడి వేడి మష్రూమ్స్ నూడుల్స్ తయారైనట్లే...!