బొజ్జ గణపయ్యకు "ఫ్రూట్ సలాడ్"
కావలసిన పదార్థాలు :పచ్చికొబ్బరి తురుము... ఒక కప్పుఅరటిపండ్లు... రెండుజామకాయ.. ఒకటిపంచదార.. రెండు టీ.తేనె.. రెండు టీ.ఎండు ఖర్జూరాలు.. వంద గ్రా.తయారీ విధానం :కొబ్బరి తురుములో జామ, ఎండు ఖర్జూరం, అరటిపండు ముక్కలు వేసి కలిపి చిన్న చిన్న బౌల్స్‌లోకి సర్దాలి. వాటిని పదినిమిషాలపాటు అలాగే ఉంచినట్లయితే చక్కగా ఊరుతాయి. అంతే ఫ్రూట్ సలాడ్ రెడీ..! చాలా రుచిగా ఉండే ఈ సలాడ్‌ను దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. వృద్ధులూ, అనారోగ్యంతో బాధపడేవాళ్లూ... కటిక ఉపవాసం చేయకుండా ఈ సలాడ్‌ను తిని, గ్లాసుడు పాలు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.