కావలసిన పదార్థాలు :
సిమ్లా మిర్చి... అరకేజీ
నూనె... తగినంత
శెనగపిండి... పావు కేజీ
పచ్చికొబ్బరి తురుము... అరకప్పు
జీలకర్రపొడి... అరకప్పు
వాముపొడి... అర కప్పు
ఆమ్‌ఛూర్ పొడి... అర కప్పు
కరివేపాకు పొడి... అర కప్పు
ఉప్పు... సరిపడా
తయారీ విధానం :
పచ్చిమిర్చిని పొడవుగా గాటు పెట్టి ఉంచాలి. శెనగపిండి జల్లించి అందులో కొబ్బరి తురుము, కరివేపాకు, ఆమ్‌ఛూర్, జీరా, వాము పొడులతో పాటు ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చీల్చి ఉంచిన పచ్చిమిర్చిల లోపల కూరి వాటిని దారంతో కుట్టేసి నూనెలో వేయించి తీయాలి. దారాలు విప్పేసి వీటిని అలాగేగానీ, వేడి వేడి అన్నంలో నెయ్యి కలుపుకునిగానీ తింటే అద్భుతంగా ఉంటాయి. మీరూ ట్రై చేయండి మరి...!!