కావలసిన పదార్థాలు : బేబీకార్న్... పది నూనె... ఒక టీ. పచ్చికొబ్బరి తురుము... రెండు టీ. ఆవాలు... పావు టీ. పచ్చిమిర్చి... ఒకటి వెల్లుల్లి రెబ్బలు... రెండు రెబ్బలు ఉప్పు... రుచికి తగినంత
తయారీ విధానం : ఒక్కొక్క బేబీకార్న్‌ను ముక్కలుగా కట్ చేసి వెడల్పాటి పాత్రలో వేసుకోవాలి. పైన కొద్దిగా వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగును చల్లాలి. కడాయిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. బేబీకార్న్‌ను ఈ పోపులో వేసి ఉప్పు చల్లి, ఓ నిమిషంపాటు వేయించాలి. చివరగా కొబ్బరితురుమును చల్లి బాగా కలియబెట్టి దించి, వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే బేబీకార్న్ విత్ కోకోనట్ సిద్ధమైనట్లే..! దీనిని అన్నంలోకి సైడ్‌డిష్‌గానూ, ఈవెనింగ్ స్నాక్స్‌గానూ వాడుకోవచ్చు.