"బఠాణీ సూప్"లో పోషకాలు మెండు..!
కావలసిన పదార్థాలు :రెండుగా విడదీసిన ఎండు బఠాణీలు... రెండు కప్పులుమంచినీళ్లు.. పది కప్పులుకేరట్లు.. మూడుఉల్లిపాయ.. ఒకటిఉప్పు... ఒక టీ.నల్ల మిరియాలు... అర టీ.తయారీ విధానం :పెద్ద పాత్రలో నీళ్లు పోసి అందులో బఠాణీ పప్పులను వేసి ఉడికించాలి. అందులోనే కేరట్, ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి మూతపెట్టాలి. సన్నటి సెగపై ఇంచుమించు రెండుగంటలపాటు (బఠాణీలు, కేరట్, ఉల్లిపాయలు బాగా ఉడికి చిక్కగా అయ్యేంతదాకా) ఉంచాలి. తరువాత అందులో తగినంత ఉప్పు, మిరియాలపొడి వేస్తే బఠాణీ సూప్ తయారైనట్లే..! వర్షాకాలంలో సాయంత్రాల్లో వేడివేడిగా తీసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, గొంతుకు హాయిని ఇస్తుంది.