కావలసిన పదార్థాలు :
పనీర్... అర కేజీ
టొమోటోలు... అర కేజీ
ఉల్లిపాయ... ఒకటి
కొత్తిమీర... ఒక కట్ట
పచ్చిమిర్చి... రెండు
గరంమసాలా... అర టీ.
నూనె... సరిపడా
క్రీము... 50 గ్రా.
అల్లంవెల్లుల్లి ముద్ద... ఒక టీ.
తయారీ విధానం :
కడాయిలో నూనె వేసి వేడయ్యాక తరిగిన ఉల్లిపాయలను వేసి.. అవి బంగారు రంగులోకి వచ్చేదాకా వేయించాలి. తరువాత అందులోనే అల్లం వెల్లుల్లి ముద్దను వేసి కాసేపు వేయించి ఆపై... టొమోటో ముక్కలు, కొత్తిమీర తరుగు, చీరిన పచ్చిమిర్చిని వేసి అరగంటపాటు ఉడికించి చల్లారనివ్వాలి.
తిరిగీ సన్నటి మంటపై పై పదార్థాన్ని ఉడికిస్తూ అందులో గరంమసాలా, ఉప్పువేసి రెండు నిమిషాలపాటు ఉంచాలి. తరువాత అందులో ముక్కలుగా కోసుకున్న పనీర్‌ని వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. దించే ముందు క్రీము వేసి కొత్తిమీరతో అలంకరించి సర్వ్ చేయాలి. ఇది చపాతీల్లోకి చాలా బాగుంటుంది.