కావలసిన పదార్థాలు :
బాగా ఎండిపోయిన కేక్ లేదా బ్రెడ్... అరకేజీ
మిక్స్‌డ్ ఫ్రూట్ జామ్... రెండు టీస్పూన్లు
ఐసింగ్ షుగర్... 300 గ్రాములు
కకోవా పొడి... ఒక టీస్పూన్
తయారీ విధానం :
ఎండిన కేక్ లేదా బ్రెడ్‌ను పొడిలాగా చేసుకుని ఉంచాలి. మిక్స్‌డ్ ఫ్రూట్ జామ్‌లో ఈ కేకు లేదా బ్రెడ్ పొడిని వేసి బాగా కలిపినట్లయితే.. ముద్దలాగా తయారవుతుంది. ఈ ముద్దను చేతితో లడ్డూల్లాగా చేసుకోవాలి. మళ్లీ ఒక్కో ముద్దపై చిన్నసైజు గోలీల్లాంటి మరో ముద్దలను పెట్టి కావాల్సిన రీతిలో బొమ్మల్లాగా చేసుకోవాలి.
తరువాత కకోవా పొడి కలిపిన ఐసింగ్ షుగర్‌ను ఈ బొమ్మలపైన పోస్తే పూతలాగా ఏర్పడుతుంది. అంతే డ్రై కేక్ జామ్ డాల్స్ రెడీ అయినట్లే...! (ఐసింగ్ షుగర్ చేయాలంటే... ఒక గిన్నెలో పంచదార వేసి పావుకప్పు నీళ్లు పోసి కకోవా పొడి కలిపి స్టవ్‌పైన వేడిచేయాలి. పంచదార కరగ్గానే దించి చల్లారకుండానే బొమ్మలపైన పోస్తే పూతలాగా ఏర్పడుతుంది.)