కావలసిన పదార్థాలు :
అరటిపండ్లు... పది
నీరు... నాలుగు కప్పులు
పంచదార... 350 గ్రా.
యాలక్కాయలపొడి... రెండు టీ.
జీడిపప్పు, బాదంపప్పు... గార్నిష్‌కి సరిపడా
తయారీ విధానం :
అరటిపండ్ల పై తొక్క తీసి, గుండ్రటి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నీటిని వేడి చేసి అందులో పంచదార కలిపి మరిగించాలి. పాకం చిక్కగా అయిన తరువాత దించి, అరటిపండు ముక్కలను వేయాలి. దాంట్లో యాలక్కాయలపొడి, కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసి కలపాలి. పైన జీడిపప్పు, బాదంపప్పులతో గార్నిష్ చేసి ఫ్రిజ్‌లో ఉంచాలి. బాగా చల్లబడిన తరువాత ప్లేట్లలో సర్ది సర్వ్ చేయాలి. అంతే బనానా ఫుడ్డింగ్ రెడీ...!
అరటిపండులో విటమిన్ బి6, పీచు పదార్థాలు, విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియంలు సమృద్ధిగా లభిస్తాయి. బలహీనతను దూరం చేయడమేకాదు, డిప్రెషన్ బారిన పడకుండా కాపాడే సుగుణాలు అరటిపండులో ఉన్నాయి. పిల్లలకు కూడా ఇది మంచి పోషకాహారం మరియు తేలికగా జీర్ణమయ్యే పదార్థాం కూడానూ...!!